మునుపటి హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ కస్టమర్ల కోసం ముఖ్యమైన కమ్యూనికేషన్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ ("హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్") తో మునుపటి హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ("ఇ-హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్") యొక్క విలీనాన్ని అనుసరించి మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సలహా ప్రకారం, కస్టమర్ నుండి వసూలు చేయబడే తుది వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేకుండా ఇ-హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ కస్టమర్లు అందరి ఫ్లోటింగ్ వడ్డీ రేటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు వర్తించే బాహ్య బెంచ్‌మార్క్‌కు మైగ్రేట్ చేయబడింది. ఈ విషయానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఆగస్ట్ 12, 2023 నుండి సెప్టెంబర్ 16, 2023 మధ్య అందరు కస్టమర్లకు మెయిల్ ద్వారా పంపబడింది.

ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం కొనసాగించడానికి, ఇ-హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ యొక్క అందరు రిటైల్ కస్టమర్లు (విలీనం తేదీ నాటికి ఉన్న వారు) వారి అర్హత ప్రకారం బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయబడిన వారి ప్రస్తుత వడ్డీ రేటును తిరిగి సరి చేసేందుకు అందుబాటులో ఉన్న ఒక సారి ఉపయోగించగలిగే ఎంపికను పొందడానికి బ్యాంకును సంప్రదించవచ్చు. ఈ వన్-టైమ్ ఎంపిక కోసం ఎటువంటి ఛార్జీలు విధించబడవు.
 

... మరింత చదవండి

తరువాతి అడుగులు:

- మీరు ఒక రిటైల్ కస్టమర్ అయితే, మీ అర్హత ప్రకారం బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయబడిన మీ ప్రస్తుత వడ్డీ రేటును తిరిగి ఫిక్స్ చేయడానికి మీకు వన్-టైమ్ ఆప్షన్ ఉంది. అయితే, మీరు 1 జూలై 2023 కు ముందు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ నుండి లోన్ పొంది ఉంటే మరియు తరువాత మీ లోన్‌ను 1 జూలై 2023 నుండి ఇప్పటి వరకు మార్చుకున్నట్లయితే, దయచేసి ఈ కమ్యూనికేషన్‌ను విస్మరించండి.
- ఈ ఎంపికను ఉపయోగించడానికి, దయచేసి ఏదైనా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హోమ్ లోన్ బ్రాంచ్‌ను సందర్శించండి లేదా మా వెబ్‌సైట్‌లోని కస్టమర్ పోర్టల్కు లాగిన్ అవ్వండి.

మా పై మీ నిరంతర విశ్వాసాన్ని మేము అభినందిస్తున్నాము మరియు మీకు సంతృప్తికరమైన సేవలను అందిస్తాము.

తక్కువగా చదవండి