మీ లోన్ అవసరాలు గురించి మాకు చెప్పండి

నా నివాస స్టేటస్

హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్, ప్రాసెసింగ్ ఫీజు, ఛార్జీలు

హోమ్ లోన్ డాక్యుమెంట్లు

జీతం పొందే వ్యక్తుల కోసం

హోమ్ లోన్ అప్రూవల్ కోసం, అందరు అప్లికెంట్లు/కో-అప్లికెంట్లకు చెందిన ఈ క్రింది డాక్యుమెంట్లతో పాటు మీరు పూర్తి చేసిన మరియు సంతకం చేసిన హోమ్ లోన్ అప్లికేషన్ ఫారంను సబ్మిట్ చేయాలి. హోమ్ లోన్ డాక్యుమెంట్లను తనిఖీ చేయండి

డాక్యుమెంట్ల జాబితా
 

A క్ర. సం. తప్పనిసరి డాక్యుమెంట్లు
  1 పాన్ కార్డు లేదా ఫారం 60 (కస్టమర్ వద్ద పాన్ కార్డు లేకపోతే)
B క్ర. సం. వ్యక్తుల చట్టబద్ధమైన పేరు మరియు ప్రస్తుత చిరునామాను ధృవీకరించడానికి అంగీకరించదగిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు (OVD) యొక్క వివరణ*[క్రింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చు] గుర్తింపు చిరునామా
  1 చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. Y Y
  2 గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. Y Y
  3 ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు Y Y
  4 ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ Y Y
  5 పేరు, చిరునామా వివరాలు కలిగి జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ. Y Y
  6 ఆధార్ నంబర్ ఆధీనం యొక్క రుజవు ( స్వచ్చందంగా పొందాలి) Y Y


జారీ చేయబడిన తరువాత పైన పేర్కొనబడిన డాక్యుమెంట్లో పేరులో మార్పు ఉన్నా అది OVD గా పరిగణించబడుతుంది, అయితే ఆ మార్పును సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేదా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేయబడిన మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా సపోర్ట్ చేయబడాలి.

  • గత 3 నెలల జీతము పత్రాలు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్

కొత్త ఇళ్ళ కొరకు:
 

  • అలాట్మెంట్ లెటర్ కాపీ / కొనుగోలుదారు అగ్రిమెంట్
  • డెవలపర్ కు పేమెంట్/(లు) చేసిన రసీదు/(లు)

 

రీసేల్ ఇళ్ళ కొరకు:
 

  • ఆస్తి డాక్యుమెంట్ల మునుపటి గొలుసు డాక్యుమెంట్లతో సహా టైటిల్ డీడ్స్
  • విక్రేయదారునికి చెల్లించిన ప్రారంభ చెల్లింపు(లు) రసీదు(లు)
  • అమ్మకపు ఒప్పందం యొక్క కాపీ (ఇప్పటికే అమలు చేసి ఉంటే)

 

నిర్మాణం కోసం:
 

  • ప్లాట్ యొక్క టైటిల్ డీడ్స్ 
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • స్థానిక సంస్థలచే అప్రూవ్ చేయబడిన ప్లాన్ కాపీలు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ ద్వారా చేయబడిన నిర్మాణ అంచనా

  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • ఒక వేళ మీరు ప్రస్తుత ఉద్యోగం ఒక సంవత్సరం కన్నా తక్కువ నుంచి చేస్తుంటే ఉద్యోగ ఒప్పందం / అపాయింట్మెంట్ లెటర్
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి.
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ పేరు మీద చెక్.

అన్ని డాక్యుమెంట్ల స్వయం ధృవీకరణ అవసరం. పైన సూచించిన జాబితాలో ఉండే డాక్యుమెంట్లు కాక అదనపు డాక్యుమెంట్లు కూడా అడగబడవచ్చు.
 

హోమ్ లోన్ ఛార్జీలు మరియు ఫీజులు

జీతం పొందే వ్యక్తుల కోసం

తీసుకున్న లోన్ (*) యొక్క స్వభావం ఆధారంగా చెల్లించవలసిన హోమ్ లోన్ ఫీజులు మరియు ఛార్జీలు / చెల్లింపులు యొక్క సూచనాత్మక జాబితా ఇక్కడ ఇవ్వబడింది. హోమ్ లోన్ డాక్యుమెంట్లను చెక్ చేయండి

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3,000 + వర్తించే పన్నులు, ఏది ఎక్కువగా ఉంటే అది.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటీ / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్దమైన / రెగ్యులేటరీ సంస్థల కారణంగా వర్తించే అన్ని ఛార్జీలు మరియు వర్తించే పన్నులు కస్టమర్ ద్వారా మాత్రమే భరించాలి మరియు చెల్లించాలి (లేదా సందర్భాన్ని బట్టి రిఫండ్ చేయబడతాయి). అటువంటి అన్ని ఛార్జీలు గురించిన వివరాల కోసం మీరు CERSAI వెబ్‌సైట్‌ను ఇక్కడ సందర్శించవచ్చు www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిస్‌హానర్ ఛార్జీలు  ₹300**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹500 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹500 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్‌వాంటేజ్ స్కీమ్ కింద తాత్కాలిక ప్రీపేమెంట్ రివర్సల్ రివర్సల్ సమయంలో 250/- మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులు

హౌసింగ్ లోన్లు

A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో సహ రుణదాతలతో లేదా లేకుండా వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన రుణాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం లోన్ మంజూరు చేయబడినప్పుడు మినహా ఏదైనా వనరుల* ద్వారా చేసిన పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించబడవు**.
B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు చేయబడే మొత్తాల యొక్క 2% రేటు వద్ద ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది, మరియు స్వంత వనరుల ద్వారా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపులు మినహా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కోసం వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు*.


 

నాన్ హౌసింగ్ లోన్స్ మరియు బిజినెస్ లోన్స్‌గా వర్గీకరించబడ్డ లోన్స్**

A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో కో-ఆబ్లిగెంట్లు సహా లేదా వారు లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాలలో 2% రేటు వద్ద మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన శిస్తులతో ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది.
వ్యాపార ప్రయోజనాలు కాకుండా వ్యక్తులకు మంజూరు చేయబడిన ఆస్తి పై లోన్లు / హోమ్ ఈక్విటీ లోన్ల పై పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ల కారణంగా ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు చెల్లించబడవు**
B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ముందస్తు చెల్లింపు ఛార్జీ విధించబడుతుంది.

 

 


స్వంత వనరులు:
 *ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

బిజినెస్ లోన్‌లు: **ఈ క్రింది లోన్లు బిజినెస్ లోన్లుగా వర్గీకరించబడతాయి:

  1. LRD లోన్లు
  2. ఆస్తి పైన లోన్లు / బిజినెస్ ప్రయోజనం కోసం హోమ్ ఈక్విటీ లోన్ అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తిని పొందడం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.
  3. నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు
  4. నాన్ రెసిడెన్షియల్ ఈక్విటీ లోన్
  5. బిజినెస్ ప్రయోజనం కోసం టాప్ అప్ లోన్లు అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తి స్వాధీనం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.

లోన్ ముందస్తు చెల్లింపు సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్‌ డి ఎఫ్‌ సి సరిపోయే మరియు సరైనవని భావించే పత్రాలను రుణగ్రహీత సమర్పించాల్సి ఉంటుంది.

ప్రీపేమెంట్ ఛార్జీలు హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత పాలసీల ప్రకారం మార్పునకు లోబడి ఉంటాయి మరియు తదనుగుణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు, వాటి గురించి సమాచారాన్ని ఇందులో తెలియజేయబడుతుంది:‌ www.hdfc.com.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సౌకర్యం పొందడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను చర్చించడానికి ఇక్కడ క్లిక్ చేయండి మీకు తిరిగి కాల్ చేయడానికి మాకు అనుమతిని ఇవ్వడానికి లేదా మా ప్రస్తుత కస్టమర్లకు ఆన్‌లైన్ యాక్సెస్, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని పొందడానికి 24x7 . హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:
 

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ లోన్లలో తక్కువ రేటుకు మారండి (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్‌డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‌కు మారడం (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ఫిక్సెడ్ రేటు నుండి వేరియబుల్ రేటుకు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు అలాగే ఉంటుంది బెంచ్- మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు ఏవీ ఉండవు

RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు తగ్గించబడి ఉంటుంది బెంచ్‌మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు

తక్కువ రేటుకు మారండి (హెచ్ డి ఎఫ్ సి రీచ్ క్రింద లోన్లు)- వేరియబుల్ రేటు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై బకాయి ఉన్న ప్రిన్సిపల్ మరియు పంపిణీ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) యొక్క 1.50% వరకు + కన్వర్షన్ సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు.

హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్‌వాంటేజ్ స్కీమ్‌కు మారండి

ప్రాసెసింగ్ ఫీజుతో మార్పిడి సమయంలో ఒకసారి బకాయి ఉన్న లోన్ మొత్తంలో 0.25% + మార్పిడి సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు

(*) పైన పేర్కొన్న విషయాలు ఎప్పటికప్పుడు మార్పుకు లోబడి ఉంటాయి మరియు అటువంటి ఛార్జీ తేదీనాటికి వర్తించే రేట్ల ప్రకారం దాని విధింపు ఉంటుంది.
**షరతులు వర్తిస్తాయి.
 

హోమ్ లోన్ రీపేమెంట్ ఆప్షన్లు

జీతం పొందే వ్యక్తుల కోసం

SURF ఆప్షన్ ద్వారా మీ రీపేమెంట్ షెడ్యూల్ ను మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో లింక్ చేసుకొనవచ్చును. మీరు పెద్ద లోన్ అమౌంట్ తీసుకుని ప్రారంభ సంవత్సరాలలో తక్కువ EMI లు చెల్లించవచ్చును. తరువాత, మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో సమానంగా ఉండేటట్లు రీపేమెంట్ అమౌంట్ ను పెంచుకోవచ్చును.

FLIP మీ రీ పేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మీకు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాలలో EMI ఎక్కువ ఉండేటట్లు తరువాత మీ ఆదాయంతో సమానంగా తగ్గేటట్లు లోన్ నిర్మాణం చేసుకొనవచ్చును.

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.

ఈ ఆప్షన్ లో మీరు ప్రతి సంవత్సరము మీ ఆదాయం తో సరిసమానంగా EMI లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు లోన్ ను తొందరగా రీపేమెంట్ చేయవచ్చును.

ఈ ఆప్షన్ లో మీరు ఎక్కువ రీ పేమెంట్ కాలాన్ని 30 సంవత్సరముల వరకు ఎంచుకొనవచ్చును. అంటే ఎక్కువ లోన్ అమౌంట్ మరియు తక్కువ ఈ ఎం ఐ లు.

వివిధ నగరాల్లో హోమ్ లోన్

హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

avail_best_interest_rates

మీ హోమ్ లోన్ పై ఉత్తమ వడ్డీ రేట్లు పొందండి!

loan_expert

మా లోన్ నిపుణుడు మిమ్మల్ని మీ ఇంటి వద్దనే కలుస్తారు

give_us_a_missed_call

మాతో సంభాషించడానికి దీనిపై
+91 9289200017

visit_our_branch_nearest_to_you

మీకు సమీపంలోని మా బ్రాంచ్‌ను
సందర్శించండి

మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!

Thank you!

కృతజ్ఞతలు!

మా లోన్ నిపుణుడు త్వరలో మీకు ఫోన్ చేస్తారు!

సరే

ఏదో తప్పు జరిగింది!

దయచేసి మళ్లీ ప్రయత్నించండి

సరే

కొత్త హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

మాకు ఈ నెంబర్ పై మిస్డ్ కాల్ ఇవ్వండి

Phone icon

+91-9289200017

త్వరగా పే చేయండి

లోన్ కాలం

15 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

ఇందులో అత్యంత ప్రాచుర్యం

లోన్ కాలం

20 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

సులువుగా తీసుకోండి

లోన్ కాలం

30 సంవత్సరాలు

వడ్డీ రేటు

8.50సంవత్సరానికి %.

800 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కోసం*

* ఈ రోజు ఉన్న రేట్లు ఈ విధంగా ఉన్నాయి,

మీకు ఏది సరైనదో ఖచ్చితంగా తెలియదా?

Banner
"శీఘ్ర సర్వీస్ మరియు అవగాహన ను అభినందించండి హెచ్ డి ఎఫ్ సి హోసింగ్ ఫైనాన్స్ లో"
- అవినాష్ కుమార్ రాజ్ పురోహిత్, ముంబై

మీ వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

198341
198341
198341
198341
ఋణవిమోచన షెడ్యూల్ చూడండి

EMI బ్రేక్-డౌన్ చార్ట్