మా లోన్ నిపుణుడి నుండి కాల్ పొందడానికి దయచేసి మీ వివరాలను షేర్ చేయండి!
ఈ క్యాలిక్యులేటర్లు కస్టమర్లకు వారి స్వంతంగా ఒక సాధారణ ప్లాన్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తాయి. ఇవి అందించే ఫలితాలు మీరు నమోదు చేసిన విలువలతో సహా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే, వీటికి ఖచ్ఛితత్వం లేదా ఇవి మీ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయని మేము హామీ ఇవ్వము.
NRIలు నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ EMI ని సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడుతుంది. ఒక హోమ్ లోన్ కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యొక్క EMI కాలిక్యులేటర్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. EMI కాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ చెల్లింపు కోసం మీ క్యాష్ ఫ్లోలను ప్లాన్ చేయడంలో ఉపయోగపడుతుంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ప్రతి లక్షకు ₹787 నుండి ప్రారంభమయ్యే EMIలతో మరియు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలు మరియు టాప్-అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో సంవత్సరానికి 8.75%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో హోమ్ లోన్లను అందిస్తుంది. తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాల రీపేమెంట్ అవధితో, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు మీ కోసం సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI ని నిర్ధారిస్తుంది. మా సమంజసమైన EMI లతో, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. మీ హోమ్ లోన్ కోసం మీరు చెల్లించవలసిన EMI ను లెక్కించడానికి ఉపయోగించండి సులభంగా అర్థం అయ్యే హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్.
హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ లోన్ ఇన్స్టాల్‌మెంట్లు లెక్కించడంలో సహాయపడుతుంది. మీ హోమ్ లోన్‌కు EMI. ఇది సులభంగా ఉపయోగించగల కాలిక్యులేటర్ మరియు ఇంటి కొనుగోలుదారుకు ఆర్థిక ప్రణాళిక సాధనంగా పనిచేస్తుంది.
EMI అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్‌మెంట్. ఇందులో ప్రధాన మొత్తము తిరిగిచెల్లింపు మరియు బకాయి ఉన్న మీ హోమ్ లోన్ పై వడ్డీ చెల్లింపు ఉంటాయి. దీర్ఘకాలిక లోన్ కాలపరిమితి (గరిష్ఠంగా 30 సంవత్సరాల కాలానికి) EMI తగ్గించుకోవటంలో సహాయపడుతుంది.
EMI లెక్కింపు కోసం ఫార్ములా -
P x R x (1+R)^N / [(1+R)^N-1] ఇక్కడ-
P = ప్రిన్సిపల్ లోన్ మొత్తం
ఎన్ = నెలల్లో లోన్ అవధి
ఆర్ = నెలవారీ వడ్డీ రేటు
మీ రుణం పై వడ్డీ రేటు (R) ఒక నెలకు లెక్కించబడుతుంది.
R = వార్షిక వడ్డీ రేటు/12/100
ఒక సంవత్సరానికి వడ్డీ రేటు 7.2% అయితే, అప్పుడు ₹ = 7.2/12/100 = 0.006
ఉదాహరణకు, ఒక వ్యక్తి 120 నెలలు (10 సంవత్సరాలు) అవధి కోసం 7.2% వార్షిక వడ్డీ రేటు వద్ద ₹10,00,000 లోన్ పొందినట్లయితే, అప్పుడు అతని EMI ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది:
EMI= ₹10,00,000 * 0.006 * (1 + 0.006)120 / ((1 + 0.006)120 - 1) = ₹11,714.
చెల్లించవలసిన మొత్తం ₹11,714 * 120 = ₹14,05,703. అసలు లోన్ మొత్తం ₹10,00,000 మరియు వడ్డీ మొత్తం ₹4,05,703 ఉంటుంది
ఫార్ములా ఉపయోగించి మాన్యువల్‌గా EMI లెక్కించడం అనేది కష్టతరంగా ఉండవచ్చు.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క EMI క్యాలిక్యులేటర్ మీ రుణం యొక్క EMI ను సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడుతుంది.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యొక్క హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ EMIల కోసం చెల్లించవలసిన మొత్తం గురించి స్పష్టమైన అవగాహనను ఇస్తుంది మరియు ప్రతి నెలా హౌసింగ్ లోన్ కోసం చెల్లించవలసిన మొత్తం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇది పొందగల రుణం మొత్తాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది మరియు స్వంత సహకార అవసరాలు మరియు ఆస్తి ఖర్చును అంచనా వేయడానికి సహాయపడుతుంది. అందువల్ల హోమ్ లోన్ అర్హతను లెక్కించడానికి మరియు మీ ఇంటి కొనుగోలు ప్రయాణాన్ని మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి EMI ను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మా హోం లోన్స్ అన్ని వయస్సుల వారికీ మరియు అన్నీ రకాల వృత్తుల వారి అవసరాలకి తగినట్లుగా రూపొందించబడింది. మేము సర్దుబాటు చేయదగిన రేట్ ఆప్షన్ క్రింద 30 సంవత్సరాల వరకు దీర్ఘకాల అవధి, టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ అందిస్తాము, దీని వలన యువ కస్టమర్లు తమ జీవితాలలో త్వరగా ఇంటి యాజమానులు అయ్యే విధంగా సహకరిస్తుంది.
4 దశాబ్దాలుగా హోమ్ ఫైనాన్స్‌ను అందించిన మా అనుభవంతో, మేము మా కస్టమర్ల యొక్క విభిన్న అవసరాలను అర్థం చేసుకోగలుగుతాము మరియు ఇంటిని సొంతం చేసుకోవాలనే వారి కలను నెరవేరుస్తాము .
మీ EMI తెలుసుకొనుటకు ఈ క్రింది వాటిని ఇన్పుట్ చేయాలి:
ఋణవిమోచన అంటే లోన్ వ్యవధిలో సాధారణ చెల్లింపులతో లోన్‌ను తగ్గించే ప్రాసెస్. హోమ్ లోన్ ఋణవిమోచన షెడ్యూల్ అనేది తిరిగి చెల్లించే మొత్తం, ప్రధాన మరియు వడ్డీ భాగం యొక్క వివరాలను ఇచ్చే ఒక టేబుల్.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యొక్క EMI క్యాలిక్యులేటర్లు రుణ అవధి మరియు వడ్డీ రేట్ల ఆధారంగా అసలు మొత్తము మరియు బాకీ ఉన్న వడ్డీల మధ్య నిష్పత్తి గురించి సముచితమైన అవగాహనను ఇస్తాయి. అంతే కాకుండా EMI క్యాలిక్యులేటర్లు రీపేమెంట్ షెడ్యూల్‌ను స్పష్టపరుస్తూ ఒక రుణవిమోచన షెడ్యూల్‌ను కూడా అందిస్తుంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ వడ్డీ మరియు అసలు మొత్తముల సంపూర్ణ వివరణను అందిస్తుంది.
విభిన్న అవసరాలకు తగినట్లుగా హోమ్ లోన్ అర్హత ను గరిష్టంగా పెంచుకోవడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వివిధ రీపేమెంట్ ప్లాన్లను అందిస్తుంది.
SURF ఆప్షన్ ద్వారా మీ రీపేమెంట్ షెడ్యూల్ ను మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో లింక్ చేసుకొనవచ్చును. మీరు పెద్ద లోన్ అమౌంట్ తీసుకుని ప్రారంభ సంవత్సరాలలో తక్కువ EMI లు చెల్లించవచ్చును. తరువాత, మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో సమానంగా ఉండేటట్లు రీపేమెంట్ అమౌంట్ ను పెంచుకోవచ్చును.
FLIP మీ రీ పేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మీకు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాలలో EMI ఎక్కువ ఉండేటట్లు తరువాత మీ ఆదాయంతో సమానంగా తగ్గేటట్లు లోన్ నిర్మాణం చేసుకొనవచ్చును.
ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.
ఈ ఆప్షన్ లో మీరు ప్రతి సంవత్సరము మీ ఆదాయం తో సరిసమానంగా EMI లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు లోన్ ను తొందరగా రీపేమెంట్ చేయవచ్చును.
ఈ ఆప్షన్ లో మీరు ఎక్కువ రీ పేమెంట్ కాలాన్ని 30 సంవత్సరముల వరకు ఎంచుకొనవచ్చును. అంటే ఎక్కువ లోన్ అమౌంట్ మరియు తక్కువ ఈ ఎం ఐ లు.
అనేక విశేషతలు ఉన్న మా EMI క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ హౌసింగ్ లోన్ యొక్క EMI లను అంచనా వేయండి, ఇప్పుడే!
క్యాలిక్యులేటర్ ఉపయోగించి EMI యొక్క అంచనాను పొందిన తర్వాత, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వారి ఆన్‌లైన్ హోమ్ లోన్స్‌తో మీ ఇంటి నుండి మీరు సౌకర్యవంతంగా ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ కలల ఇంటిని మీరు గుర్తించడానికి ముందే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఒక ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ అనేది మీ ఆదాయం, క్రెడిట్ యోగ్యత మరియు ఆర్థిక స్థితి ఆధారంగా ఇవ్వబడిన రుణం కోసం ఒక ఇన్-ప్రిన్సిపల్ ఆమోదం.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద ఆన్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయండి, క్లిక్ చేయండి ఆన్‌లైన్‌లో అప్లై చేయండి
ఒకవేళ మేము మీతో సంప్రదిస్తూ ఉండాలని మీరు కోరుకుంటే, దయచేసి మీ వివరాలను మాకు ఇవ్వండి.
ఇక్కడ క్లిక్ చేయండి హోమ్ లోన్ల గురించి మరింత తెలుసుకోవడానికి.
EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్" అనగా నెలవారీ వాయిదా, ఇది మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన మాకు చెల్లించే మొత్తాన్ని సూచిస్తుంది. EMIలో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాల్లో వడ్డీ భాగం ఎక్కువగా ఉంటుంది మరియు లోన్ చివరి కాలంలో అసలు భాగం ఎక్కువగా ఉంటుంది.
లోన్ పంపిణీ చేయబడిన నెల తరువాత నెల నుండి EMI ప్రారంభమవుతుంది. నిర్మాణంలో ఉన్న ఆస్తుల కోసం లోన్లపై EMI సాధారణంగా పూర్తి హోమ్ లోన్ పంపిణీ చేయబడిన తర్వాత ప్రారంభమవుతుంది కానీ కస్టమర్లు తమ మొదటి పంపిణీ పొందిన వెంటనే తమ EMIలను ప్రారంభించడానికి ఎంచుకోవచ్చు మరియు ప్రతి తరువాతి పంపిణీకి తగినట్లుగా వారి EMIలు తదనుగుణంగా పెరుగుతాయి. రీసేల్ కేసుల కోసం, పూర్తి లోన్ మొత్తం ఒకేసారి పంపిణీ చేయబడుతుంది కాబట్టి, పూర్తి లోన్ మొత్తంపై EMI పంపిణీ నెల తరువాత ప్రారంభం అవుతుంది
ఒక హోమ్ లోన్ కోసం EMI కాలిక్యులేటర్ యొక్క ప్రయోజనాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి-
మీ ఫైనాన్సులను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది
ఒక EMI కాలిక్యులేటర్ మీ నగదు ప్రవాహాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, తద్వారా మీరు ఒక హోమ్ లోన్ పొందినప్పుడు మీ హోమ్ లోన్ చెల్లింపులను సులభంగా చేయగలుగుతారు. మరో మాటలో చెప్పాలంటే, EMI కాలిక్యులేటర్ అనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు లోన్ సర్వీసింగ్ అవసరాలకు ఒక ఉపయోగకరమైన సాధనం.
సులభంగా వాడవచ్చు
EMI కాలిక్యులేటర్లు చాలా సులభం మరియు ఉపయోగించడానికి సులభం. మీరు మూడు ఇన్‌పుట్ విలువలను మాత్రమే అందించాలి అవి::
a. లోన్ మొత్తం
b. వడ్డీ రేటు
c. అవధి
ఈ మూడు ఇన్‌పుట్ విలువల ఆధారంగా, ప్రతి నెలా హోమ్ లోన్ ప్రొవైడర్‌కు మీరు చెల్లించవలసిన ఇన్‌స్టాల్‌మెంట్‌ను EMI కాలిక్యులేటర్ లెక్కిస్తుంది. హోమ్ లోన్ కోసం కొన్ని EMI కాలిక్యులేటర్లు మీరు మొత్తం లోన్ అవధిలో చెల్లించే వడ్డీ మరియు అసలు మొత్తం యొక్క వివరణాత్మక వివరాలను కూడా అందిస్తాయి.
ఆస్తి శోధనపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది
EMI కాలిక్యులేటర్ మీ నెలవారీ బడ్జెట్‌కు సరిపోయే సరైన హోమ్ లోన్ మొత్తాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది, మీరు లోన్ EMI మరియు అవధిని మీ ఆర్థిక స్థితికి అత్యంత సరిపోయే విధంగా నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ ఆస్తి శోధనపై మరింత దృష్టి సారించడానికి సహాయపడుతుంది.
సులభంగా యాక్సెస్ చేయదగినది
ఒక ఆన్‌లైన్ EMI కాలిక్యులేటర్ ఎక్కడినుండైనా సులభంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీ అవసరాలకు సరిపోయే సరైన హోమ్ లోన్ మొత్తం, EMIలు మరియు అవధిని చేరుకోవడానికి అవసరమైనన్ని సార్లు ఇన్‌పుట్ వేరియబుల్ యొక్క వివిధ కాంబినేషన్లను మీరు ప్రయత్నించవచ్చు.
మీరు హోమ్ లోన్ పొందవచ్చు మరియు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, జైపూర్ మరియు మరిన్ని నగరాల్లో మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు.
ప్రీ-EMI అంటే మీ హోమ్ లోన్‌పై నెలవారీ వడ్డీ చెల్లింపు. లోన్‌ను పూర్తిగా పంపిణీ చేసే వరకు ఈ మొత్తం చెల్లించబడుతుంది. మీ వాస్తవ లోన్ అవధి - మరియు EMI (ప్రిన్సిపల్ మరియు వడ్డీ రెండింటినీ కలిగి ఉంటుంది) చెల్లింపులు - ప్రీ-EMI దశ ముగిసిన తర్వాత అంటే లోన్ పూర్తిగా పంపిణీ చేయబడిన తర్వాత ప్రారంభమవుతాయి.
అవును. మీ సమీప హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ శాఖను సందర్శించడం ద్వారా అలా చేయవచ్చు.
హోమ్ లోన్ సాధారణంగా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI) ద్వారా తిరిగి చెల్లించబడుతుంది. EMI లో ప్రిన్సిపల్ మరియు వడ్డీ కాంపొనెంట్లు ఉంటాయి, మీ లోన్ యొక్క ప్రారంభ సంవత్సరాలలో, వడ్డీ కాంపొనెంట్ ప్రిన్సిపల్ కాంపొనెంట్ కంటే ఎక్కువగా ఉండే విధంగా మరియు లోన్ యొక్క తరువాతి కాలంలో ప్రిన్సిపల్ కాంపొనెంట్ అధికంగా ఉండే విధంగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.
మీ సౌలభ్యం కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వివిధ పద్ధతులను అందిస్తుంది. భారతదేశంలో మీ నాన్-రెసిడెంట్ (బాహ్య) అకౌంట్ / నాన్-రెసిడెంట్ (సాధారణ) అకౌంట్ నుండి ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా ఇన్స్టాల్మెంట్లను చెల్లించడానికి మీరు పోస్ట్-డేటెడ్ చెక్కులు లేదా మీ బ్యాంకుకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయవచ్చు. నగదు చెల్లింపులు అంగీకరించబడవు.
ఆలస్యం చేయబడిన చెల్లింపుల కోసం జరిమానా మరియు చెక్ బౌన్స్ ఛార్జీల పై వివరాల కోసం, దయచేసి మా నిర్దిష్ట ప్రాడక్ట్ పేజీలలోని సమాచారాన్ని చూడండి
ఒక డెవలపర్ నుండి నిర్మాణంలో ఉన్న లేదా సిద్ధంగా ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడానికి, రీసేల్ ఆస్తిని కొనుగోలు చేయడానికి, ఒక ప్లాట్ పై ఒక హౌసింగ్ యూనిట్ నిర్మించడానికి, ఇప్పటికే ఉన్న ఇంటికి మెరుగులు మరియు విస్తరణలను చేయడానికి మరియు మీ ప్రస్తుత హోమ్ లోన్‌ను ఒక ఫైనాన్షియల్ సంస్థ నుండి హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి హోమ్ లోన్లు పొందబడతాయి. తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి హోమ్ లోన్ అంటే ఏమిటి
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ హోమ్ లోన్ ఆన్‌లైన్‌లో అప్లై చేసే సౌకర్యం, త్వరితం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది లోన్ ప్రాసెసింగ్, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, కస్టమైజ్ చేయబడిన రీపేమెంట్ ఎంపికలు మరియు సులభమైన మరియు అవాంతరాలు-లేని డాక్యుమెంటేషన్.
లోన్ మొత్తం ఆధారంగా మీరు మొత్తం ఆస్తి ఖర్చులో 'మీ వంతుగా 10-25% చెల్లించవలసి ఉంటుంది. ఆస్తి ఖర్చులో 75 నుండి 90% వరకు హౌసింగ్ లోన్ గా పొందవచ్చు. నిర్మాణం, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ మరియు హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ల విషయంలో, నిర్మాణం/మెరుగుదల/విస్తరణ అంచనాలో 75 నుండి 90% వరకు నిధులు అందించబడవచ్చు.
మీరు 4 వేగవంతమైన మరియు సులభమైన దశలలో ఆన్‌లైన్‌లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ హోమ్ లోన్‌ను పొందవచ్చు:
1. సైన్ అప్ / రిజిస్టర్ చేయండి
2. హోమ్ లోన్ అప్లికేషన్ ఫారం నింపండి
3. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
4. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి
5. లోన్ అప్రూవల్ పొందండి
మీరు ఆన్‌లైన్‌లో ఒక హోమ్ లోన్ కోసం కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడే అప్లై చేయడానికి https://portal.hdfc.com/ సందర్శించండి!.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మీ హోమ్ లోన్ అర్హతను ప్రధానంగా మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం నిర్ణయిస్తుంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు & బాధ్యతలు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.
మీరు ఒక ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు, ఇది మీ ఆదాయం, క్రెడిట్ యోగ్యత మరియు ఆర్థిక స్థితి ఆధారంగా ఇవ్వబడే ఒక లోన్ కోసం ఒక ఇన్-ప్రిన్సిపల్ ఆమోదం.. సాధారణంగా, ప్రీ-అప్రూవ్డ్ లోన్లు ఆస్తి ఎంపికకు ముందు తీసుకోబడతాయి మరియు లోన్ శాంక్షన్ తేదీ నుండి 6 నెలల కాలానికి చెల్లుతాయి.
నిర్మాణ పురోగతి ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఆస్తుల కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రుణాలను వాయిదాల రూపంలో పంపిణీ చేస్తుంది. పంపిణీ చేయబడిన ప్రతి వాయిదాను 'పాక్షిక' లేదా 'తదుపరి' పంపిణీ అని పేర్కొంటారు.
ఈ క్రింది రకాల హోమ్ లోన్లు ఉత్పత్తులు సాధారణంగా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ద్వారా భారతదేశంలో అందించబడతాయి:
ఇవి దీని కోసం పొందిన లోన్లు:
1. ఆమోదించబడిన ప్రాజెక్టుల్లో ప్రైవేట్ డెవలపర్ల నుండి ఫ్లాట్, రో హౌస్, బంగ్లా కొనుగోలు కోసం;
2.డిడిఎ, ఎంహెచ్ఎడిఎ అలాగే ఇప్పటికే ఉన్న కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు, అపార్ట్మెంట్ యజమానుల సంఘం లేదా డెవలప్మెంట్ అధికారుల సెటిల్మెంట్లు వంటి డెవలప్మెంట్ అథారిటీల నుండి ప్రాపర్టీల లేదా ప్రైవేటుగా నిర్మించిన గృహాల కొనుగోలు కోసం హోమ్ లోన్లు;
3.ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ ప్లాట్ పైన లేదా డెవలప్మెంట్ అథారిటీ అలాట్ చేసిన ప్లాట్ పైన నిర్మాణానికి లోన్లు
ప్లాట్ కొనుగోలు రుణం నేరుగా కేటాయింపు లేదా రెండవ విక్రయ ట్రాన్సాక్షన్ ద్వారా అలాగే మరొక బ్యాంక్ /ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ ప్రస్తుత ప్లాట్ కొనుగోలు రుణాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి అందుబాటులో ఉంటుంది.
మరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ బాకీ ఉన్న హోమ్ లోన్‌ను హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌కు బదిలీ చేయడాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్ అని పేర్కొంటారు.
హౌస్ రెనొవేషన్ లోన్ అనేవి టైలింగ్, ఫ్లోరింగ్, అంతర్గత / బాహ్య ప్లాస్టర్ మరియు పెయింటింగ్ మొదలైనటువంటి అనేక మార్గాల్లో మీ ఇంటిని పునరుద్ధరించడానికి (నిర్మాణం / కార్పెట్ ప్రాంతాన్ని మార్చకుండా) ఒక లోన్.
ఇది మీ ఇంటిని విస్తరించడానికి లేదా అదనపు గదులు మరియు అంతస్తులు మొదలైనటువంటి స్థలాన్ని జోడించడానికి ఒక లోన్.