ప్రీపేమెంట్ అనేది మీ రుణం అవధి పూర్తి చేయడానికి ముందు మీ హౌసింగ్ లోన్‌ను (పాక్షికంగా లేదా పూర్తిగా) తిరిగి చెల్లించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక సదుపాయం.
మీ హౌసింగ్ లోన్ ప్రీపేమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ముందు, వైద్య అత్యవసర పరిస్థితులు మరియు వివాహం, విదేశాలలో ప్రయాణం మొదలైనటువంటి మీ ఆర్థిక లక్ష్యాల కోసం మీకు తగినంత నిధులు ఉన్నాయని మీరు నిర్ధారించుకోవాలి. మీ హోమ్ లోన్‌ను ప్రీపే చేయడానికి ముందు మీకు అవసరమైన సమయంలో డబ్బుకు లోటు రాకుండా ఉండే పరిస్థితిని నివారించే విధంగా మీరు ప్రణాళిక వేయాలి.
ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్లు వ్యక్తుల నుండి ఎటువంటి ప్రీ-క్లోజర్/ఫోర్-క్లోజర్ ఛార్జీలను ఆకర్షించవు.
కాంబినేషన్ రేటు హోమ్ లోన్ల విషయంలో, రుణం యొక్క ఫిక్స్‌డ్ అవధి సమయంలో రుణం ప్రీపే చేయబడితే మరియు అటువంటి ప్రీపేమెంట్ వ్యక్తి యొక్క స్వంత ఫండ్స్ నుండి కాక బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్/రీఫైనాన్స్ ప్రయోజనం కోసం మరొక రుణదాత నుండి అందుకున్న మొత్తం నుండి చేయబడితే రుణదాత ప్రీపేమెంట్ ఛార్జీలను విధించవచ్చు. అయితే, మీరు మీ హౌసింగ్ లోన్‌ను ప్రీపే చేయడానికి మీ స్వంత ఫండ్స్ ఉపయోగించినట్లయితే, ప్రీపేమెంట్ జరిమానా విధించబడదు.
హౌసింగ్ లోన్లను తిరిగి చెల్లించడం సులభం ; హోమ్ లోన్ల పై వడ్డీ రేటు సాధారణంగా పర్సనల్ లేదా క్రెడిట్ కార్డ్ లోన్ల పై వసూలు చేయబడే వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల, మీరు అప్పును తగ్గించాలనుకుంటే, మీరు తక్కువ వడ్డీ రేటును కలిగి ఉన్న హౌసింగ్ లోన్ల కంటే అధిక వడ్డీ కలిగిన లోన్లను ప్రీపే చేయడానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
మీరు ప్రిన్సిపల్ రీపేమెంట్ పై మరియు హౌసింగ్ లోన్ల పై చెల్లించిన వడ్డీపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హత కలిగి ఉన్నారు (నిర్దిష్ట మొత్తం కోసం మరియు షరతులకు లోబడి). అంతేకాకుండా, 'అందరికీ గృహాలు' పై ప్రభుత్వం దృష్టి సారించినందున, హౌసింగ్ లోన్ల పై పన్ను ప్రోత్సాహకాలు కాలక్రమేణా పెరగవచ్చు అని ఆశించబడుతుంది. మీ హౌసింగ్ లోన్‌ను పూర్తిగా తిరిగి చెల్లించిన మీదట మీరు పైన పేర్కొన్న పన్ను ప్రయోజనాలను పొందలేరు ; పాక్షిక ముందస్తు చెల్లింపుల విషయంలో, మీరు తదనుగుణంగా తక్కువ పన్ను ప్రయోజనాలను పొందుతారు.